ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

1 Jul, 2021 07:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వరంగల్‌ – 1 డిపోలో పెట్రోల్‌ పోసుకున్న డ్రైవర్‌

అడ్డుకున్న సహోద్యోగులు

హన్మకొండ: అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆ ర్టీసీ వరంగల్‌–1 డిపోకు చెందిన ఓ డ్రైవర్‌ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూ సింది. వరంగల్‌ 1 ఆర్టీసీ డీపోలో బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి సెలవులో ఉన్నా రు. అయితే విధులకు హాజరు కావాలని ఫోన్‌ ద్వా రా అధికారులు బలవంతం చేయడంతో ఒత్తిడి భ రించలేక ఓ సీసాలో పెట్రోల్‌ తీసుకుని డిపోకు చేరు కున్నాడు. డిపోలో అధికారులు కూడా డ్యూటీ చేయాల్సిందేనని చెప్పడంతో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సహోద్యోగులు డ్రైవ ర్‌పై నీళ్లు పోయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డిపో మేనేజర్‌ భానుకిరణ్‌ అక్కడకు చేరుకుని ఘటన గురించి ఆరా తీశారు. సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని, ఇటువంటి చర్యలకు పాల్ప డవద్దని చెప్పి డ్రైవర్‌ను ఇంటికి పంపించారు. 

ఆర్టీసీ కార్మికులను హింసకు గురిచేస్తే తిరుగుబాటు తప్పదు: థామస్‌రెడ్డి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్‌): ఆర్టీసీ కార్మికులను హింసకు గురిచేస్తే యాజ మాన్యంపై తిరుగుబాటు తప్పదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.థామస్‌రెడ్డి హెచ్చరించారు. అధికారులు హింసించడం వల్లనే రాణిగంజ్‌ డిపోకు చెందిన తిరుపతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర సదస్సు జరిగింది. థామస్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సహకారంతోనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని, ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. కవితక్క నాయకత్వంలోనే తమ యూనియన్‌ ముందుకు సాగుతుందని, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు