హాస్టల్‌లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..

12 Sep, 2022 20:03 IST|Sakshi
నిందితుడు కృష్ణ 

హయత్‌నగర్‌(హైదరాబాద్‌): విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన హాస్టల్‌ వార్డెన్‌ను ఆదివారం హయత్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతూర్‌ మండలం హల్లిగూడెంకు చెందిన ముర్రం కృష్ణ(35) హయత్‌నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు బాలుర పాఠశాల హస్టల్‌లో నెల రోజుల క్రితం వార్డెన్‌గా చేరాడు.
చదవండి: భార్య మృతితో ఒంటరి జీవితం.. ఇంట్లో వదినతో మాటలు కలిపి..

విద్యార్థులతో సన్నిహితంగా ఉంటూ అశ్లీల వీడియోలు చూపించేవాడు. వారిపక్కనే పడుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని చేష్టలు తట్టుకోలేని ఏడుగురు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు గత బుధవారం హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే కృష్ణ పరారీలో ఉన్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆదివారం కృష్ణను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు