ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి

1 Nov, 2022 07:24 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, మైసూరు: కట్టుకున్న భార్య ఇల్లు విడిచి వెళ్లి  ప్రియుడిని పెళ్లి చేసుకుందని మనోవేదనకు గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుణసూరు తాలూకా కొయమత్తూరు కాలనీ గ్రామంలో జరిగింది.  దీంతో ఓ కుటుంబం వీధినపడింది. 

పరారై ప్రియునితో పెళ్లి  
గ్రామానికి చెందిన కృష్ణేగౌడ కుమారుడు సురేశ్‌ కుమార్‌ (37), భార్య నేత్ర. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. సురేశ్‌ కుమార్‌ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నేత్ర హుణసూరులోని స్పిన్నింగ్‌ ఫ్యాక్టరీలో పనికి వెళుతోంది. ఇటీవల నేత్రా కనిపించకుండా పోవడంతో దీంతో భర్త హణసూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు శివమొగ్గలో ఉన్న నేత్రను గుర్తించారు. 

భర్తతో ఉండడం ఇష్టం లేక వచ్చేశానని ఆమె తెలిపింది. శివమొగ్గ జిల్లా సొరబ తాలూకా హోళెజోళ గ్రామంలోని గోమంతేశ్వర దేవస్థానంలో ప్రియున్ని పెళ్లి కూడా చేసుకున్నట్లు చెప్పింది. ఇందుకు రుజువుగా తమ వివాహ ఫోటోలను భర్త మొబైల్‌కు కూడా నేత్ర పంపించింది. ఆ ఫోటోలను చూసిన సురేశ్‌ జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. 

చదవండి: (పోలీసు కస్టడీకి హనీట్రాప్‌ ముఠా.. మరింత మంది స్వాములకు యువతి వల?)

మరిన్ని వార్తలు