షాకింగ్‌ క్రైమ్‌.. భర్త అలా చేశాడని.. భార్య దారుణం!

3 Aug, 2022 23:54 IST|Sakshi

క్షణికావేశంలో చేసే తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. భర్త తనను కొట్టాడన్న కోపంతో భార్య దారుణానికి ఒడిగట్టింది. యాసిడ్‌లో కారం కలిపి అతడిపై పోసింది.

వివరాల ప్రకారం.. బరేలీలో మొహమ్మద్ యాసీన్ తాగుడుకు బానిసై భార్య, పిల్లలను కొడుతుండేవాడు. ప్రతీరోజు మద్యం తాగి వచ్చి.. భార్య ఫర్హాతోపాటు నాలుగేళ్ల కుమార్తెను చితకబాదేవాడు. తాగుడు మానేయాలని భార్య ఎంత చెప్పిన వినుపించుకోలేదు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట తాగి ఇంటికి వచ్చిన భర్త.. భార్యను చెంపపై కొట్టాడు. 

దీంతో, భర్తపై కోపం తెచ్చుకుని క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. నిద్రిస్తున్న భర్తపై కారం కలిపిన యాసిడ్‌ పోసింది. దీంతో యాసీన్‌ తీవ్రంగా గాయపడంతో వారి కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ​కాగా, భర్తపై యాసిడ్‌ దాడి అనంతరం భార్య ఫర్హా, తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.అనంతరం..యాసీన్‌ బంధువులు భార్య ఫర్హాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో పైలట్‌గా ప్రొఫైల్‌ పెట్టి 30మంది మహిళలకు టోకరా!

మరిన్ని వార్తలు