భర్తను దారికి తెచ్చుకోవాలనుకుంది.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన భార్య

5 Sep, 2022 07:06 IST|Sakshi
భర్త మహేశ్‌ (ఫైల్‌)- భార్య శిల్ప

యశవంతపుర(కర్ణాటక):అక్రమ సంబంధమంటూ పదేపదే అనుమానిస్తున్న భర్తను దారికి తెచ్చుకోవాలని చూసి  చివరికి అతని మరణానికి కారణమైన భార్యను, ఆమె తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు... మండ్యకు చెందిన మహేశ్‌కు అదే ఊరికి చెందిన శిల్పాతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. బెంగళూరులోని కోణనకుంటెలో నివాసం ఉంటున్నారు. అయితే పని నిమిత్తం మహేశ్‌ మండ్యలో ఉంటూ అప్పుడప్పుడు బెంగళూరుకు వచ్చేవాడు. ఈ క్రమంలో తాగిన మత్తులో శిల్పపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ వేధించేవాడు. దీంతో శిల్ప తల్లి వద్ద తనగోడు వెళ్లబోసుకుంది.
చదవండి: నవ వధువుకు చేదు అనుభవం.. కన్యత్వ పరీక్షలో ఫెయిల్‌ కావడంతో..

గత గురువారం బెంగళూరుకు వచ్చిన  మహేశ్‌కు హెచ్చరించాలని శిల్ప తన అన్న కుమారుడు బాలాజీకి పురమాయించింది. దీంతో బాలాజీ మహేశ్‌ను ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని తీసుకుని శిల్ప మండ్యకు వెళ్లారు. అనుమానం వచ్చిన మహేశ్‌ తల్లిదండ్రులు మండ్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో శిల్పను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా అసలు విషయం బయట పడింది. శిల్పతో పాటు ఆమె తల్లిని అరెస్ట్‌ చేయగా ప్రధాన నిందితుడు బాలాజీ పరారీలో ఉన్నాడు.  

మరిన్ని వార్తలు