భర్తకు నిప్పంటించి.. బండతో బాదిన భార్య.. కారణం ఏంటంటే..

14 Sep, 2021 11:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తుమకూరు(కర్ణాటక): భార్యభర్తల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది. తుమకూరు నగరం జయనగరలో ఆదివారం మధ్యాహ్నం నారాయణ (45), భార్య అన్నపూర్ణమ్మ కొట్లాటకు దిగారు. నారాయణ నెలమంగల దగ్గరున్న మద్యం ఫ్యాక్టరీలో ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని నారాయణ అనుమానించేవాడని సమాచారం. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఇంట్లో ఉన్న కిరోసిన్‌ తీసుకొని భర్త పైన పోసి నిప్పు అంటించింది. మంటలో కాలిపోతున్న భర్త కిందపడిపోగా అతని తల పైన బండరాయితో కొట్టడంతో తల ఛిద్రమైంది. చుట్టుపక్కలవారు జయనగర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 

చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య

మరిన్ని వార్తలు