నవ వధువుని.. సెల్ఫీ దిగుదామని గుట్టపైకి తీసుకెళ్లి..

13 Aug, 2021 19:20 IST|Sakshi
శరణ్య(ఫైల్‌ఫోటో)

సాక్షి, వనపర్తి (మహబూబ్‌నగర్‌): సెల్ఫీ  దిగుదామని  చెప్పి నవ వధువును గుట్టపైకి తీసుకెళ్లిన భర్త..అక్కడి నుంచి ఆమెను తోసేసి  హతమార్చిన ఘటన వనపర్తి జిల్లా తిరుమలయ్యగుట్టపై చోటు చేసుకుంది.  మృతురాలి  బంధువులు  చెప్పిన కథనం  ప్రకారం.....  గద్వాల  జిల్లా  అలంపూర్‌  నియోజకవర్గంలోని జిలెల్ల ́పాడుకు చెందిన సరోజమ్మ,  మద్దిలేటి  దంపతులు  18 నెలల  కిందట అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురానికి బతుకుదెరువు కోసం వచ్చారు. వారి కుమార్తె  శరణ్య  అలియాస్‌  గీతాంజలిని  గట్టు  మండలం చిన్నోని పల్లెకు చెందిన జయరాం గౌడ్‌తో  రెండు నెలల  క్రితం...  వివాహం జరిపించారు. అతను భార్యను బుధవారం  వన పర్తి  వద్ద  ఉన్న  తిరుమలయ్య  గుట్ట  వద్దకు  తీసుకెళ్లాడు.

సెల్ఫీ  దిగుదామని చెప్పి ఎత్తై ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేశాడు. దీంతో  ఆమె  అక్కడికక్కడే  మృతి  చెందింది.  ఏమీ  తెలియనట్లు  జయరాంగౌడ్‌  అయిజకు  వచ్చి తన భార్య కన బడడడం లేదని గురువారం పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. దీంతో అయిజలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. జయరాం కదలికలపై  అనామానం   వచ్చిన పోలీసులు  గట్టిగా నిలదీశారు.  దీంతో  తన భార్యను తానే హత్య చేసిన ట్లు అంగీకరించినట్లు  సమాచారం....  పోలీసులు  అతడిని  అదుపులోకి  తీసుకుని..  గురువారం...  సాయంత్రం సంఘట స్థలం వనపర్తి జిల్లా తిరుమలయ్యగుట్టకు వచ్చి మహిళ మృతదేహాన్ని  గుర్తించారు. 

మరిన్ని వార్తలు