పిల్లల కళ్ల ముందే.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

21 Jun, 2021 13:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్‌ఘడ్‌: పంజాబ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తని కిరాతంగా పొడిచి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుర్గావ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సచిన్‌ కుమార్‌, గుంజన్‌ ఇద్దరు దంపతులు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సచిన్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత వారం వీరి మధ్య గొడవ తీవ్రసస్థాయికి చేరింది. దీంతో భార్య గుంజన్‌ ఆవేశం పట్టలేక వంటగదిలోని కత్తిని తీసుకొని భర్త సచిన్‌ను పొడిచి చంపింది.

ఆ సమయంలో వీరి ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు.గుంజన్‌ ఆ తర్వాత సచిన్‌ బంధువులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న వారు సంఘటన స్థలంలో రక్తపు మడుగులో ఉన్న సచిన్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సచిన్‌ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, సచిన్‌ కుటుంబ సభ్యులు, అతని భార్య గుంజన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గుంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చేపట్టిన విచారణలో గుంజన్‌, పిల్లలు తడబడటం, ఒత్తిడికి గురవ్వడాన్ని వారు గుర్తించారు. విచారణలో మరిన్ని విషయాలు బయటకు రాబడతామని స్థానిక పోలీసు అధికారి ప్రీత్‌పాల్‌ సింగ్‌ తెలిపారు.

చదవండి: దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు