వివాహేతర సంబంధం: పక్కా ప్లాన్‌.. ప్రియున్ని పిలిచి.. భర్త గొంతుకు టవల్‌ చుట్టి

18 Oct, 2021 17:23 IST|Sakshi
నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో) హతుడు రామయ్య (ఫైల్‌ ఫొటో)

ఓర్వకల్లు(కర్నూలు జిల్లా): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ప్రియుడి సాయంతో భర్తనే కడతేర్చిన భార్య ఉదంతం ఉయ్యాలవాడ గ్రామంలో చోటుచేసుకోంది. ఈ కేసుకు సంబంధించి నెల రోజులుగా పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హంతకులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. సీఐ శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన చెట్లమల్లాపురం రామయ్య(34)కు, వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామానికి చెందిన జయలక్ష్మితో 10 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.రామయ్య పండ్ల తోటల వ్యాపారం చేస్తుంటాడు. భార్య ఊళ్లోనే కూలీ పనులకు వెళ్తూ ఉంటుంది.(చదవండి: లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను చంపిన వృద్ధుడు)

జయలక్ష్మి రెండేళ్ల నుంచి గ్రామంలోని  మహ్మద్‌ ఖైజర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను మందలించేవాడు. దీంతో భర్త రామయ్యను అంతమొందించాలని ప్రియుడితో కలసి పథకం రచించింది. సెప్టెంబర్‌ 13వ తేదీ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో మహ్మద్‌ ఖైజర్‌ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. మంచంపై నిద్రిస్తున్న రామయ్య గొంతుకు టవల్‌ చుట్టి అదిమిపట్టగా, జయలక్ష్మి కాళ్లు కదలించకుండా అదిమిపట్టుకుంది. దీంతో ఊపిరాడక రామయ్య ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ఖైజర్‌ తన బొలేరో వాహనంలో తడకనపల్లె వద్దకు తీసుకువెళ్లి హంద్రీనీవా కాల్వలో పడేశాడు.

14వ తేదీ ఉదయం జయలక్ష్మి ఏమీ ఎరుగనట్లు తన భర్త జడ్చర్లకు వెళ్లి తిరిగి రాలేదని ఓర్వకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జయలక్ష్మి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా వివాహేతర సంబంధం బయటపడింది. జయలక్ష్మి, ఆమె ప్రియుడు ఖైజర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించారు. ఓర్వకల్లు, నాగలాపురం ఎస్‌ఐలు మల్లికార్జున, ఫైమ నిందితులను అదుపులోకి తీసుకొని కర్నూలు రూరల్‌ సీఐ శ్రీనా«థ్‌రెడ్డి సమక్షంలో అరెస్టు చేయగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు. హత్యకు గురైన రామయ్య మృతదేహం కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టనున్నట్లు సీఐ పేర్కొన్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు