హృదయ విదారకం: భర్త మరణంతో..

12 Sep, 2020 14:36 IST|Sakshi

భారతీయ వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారి వివాహం జరిగితే భర్తే సర్వస్వంగా బతికే భార్యలు, భార్యనే తన జీవితంగా భావించే భర్తలు చరిత్ర పుటల్లో ఎంతో మంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ విడిచివెళ్లిపోయినా తన జీవితమిక అయిపోందని తనవు చాలించే సహచరులూ ఉన్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనొకటి మధ్యప్రదేశ్ చోటుచేసుకుంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదం భర్తను బలి తీసుకోగా తానూ భర్త దగ్గరకు చేరాలనుకుంది భార్య. భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది.

వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన యువతి (28), ఉజ్జయినికి చెందిన యువకుడికి 15 రోజుల క్రితం వివాహం జరిగింది. నూతన దంపతులు ఇండోర్‌లో కాపురం పెట్టారు. సంతోషంగా సాగుతున్న వారి వైవాహిక జీవితంలో రోడ్డు ప్రమాదం చీకటిని నింపింది. బుధవారం జరిగిన ప్రమాదంలో భర్త మరణించాడు. ఈ ఘటన భార్యను తీవ్రంగా కలిచివేసింది. జీవితాంత తోడుంటాడునుకున్న భర్త ఇలా అర్థంతరంగా తనువు చాలించడాన్ని తట్టుకోలేపోయింది. తనలో సగమనుకున్న భర్తలేని జీవితాన్ని వద్దూ అనుకుని ప్రాణ త్యాగానికి సిద్ధపడింది.

భర్త మృతితో తీవ్ర మనోవేదనకు గురైన భార్య శనివారం అందరూ చూస్తుండగానే  షాపింగ్‌మాల్  మూడో అంతస్తు పైనుంచి దూకింది. అక్కడున్న సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. అయితే ఆమె చేతిలోని ఓ లేఖను సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఆర్ కుమ్రావత్ స్వాధీనం చేసుకున్నారు. భర్తతో కలిపి తన దహన సంస్కారాలు చేయాలని సూసైట్‌ నోట్‌లో రాసుకుంది.  కాగా వివాహిత షాపింగ్‌ మాల్‌పై నుంచి దూకిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరి మనసులను ఈ ఘటన కదిలిస్తోంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు