ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్‌ నిర్ణయం

24 Oct, 2022 07:40 IST|Sakshi
గోరింట ఆరకముందే.. నిహారిక (ఫైల్‌), భర్త కార్తీక్‌తో నిహారిక పెళ్లి చిత్రం

కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నగరంలోని పుట్టేనహళ్ళి పొలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిహారిక అనే యువతి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాలు... స్థానికంగా ఉండే నిహారిక (25), కార్తీక్‌లు గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. పెద్దలు మాట్లాడుకుని ఈ ఏడాది జూన్‌ 1వ తేదీన ఘనంగా పెళ్లి జరిపించారు. నిహారిక ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుండగా, భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు.
చదవండి: రెస్టారెంట్‌లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త

నిత్యం వేధింపులు  
కోటి ఆశలతో కాపురానికి వచ్చిన నిహారికకు భర్త, అత్తమామల నిజస్వరూపం కొద్దిరోజులకే అర్థమైంది. భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తూ సైకో మాదిరిగా ప్రవర్తించేవాడు. అత్తమామలు కూడా అతనికే వంత పాడేవారు. దీంతో విరక్తి చెంది ఆదివారం తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పుట్టేనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. భర్త, అతని తల్లిదండ్రుల వేధింపుల వల్లనే తమ బిడ్డ చనిపోయిందని నిహారిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు