వాస్తవ జీవితంలో దుర్మార్గుడు: డాక్టర్‌ శ్రేయ 

19 Nov, 2020 16:14 IST|Sakshi

ఆధ్యాత్మిక ముసుగులో అరాచకాలు

ప్రదీప్‌ జోషిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడో భార్య  డాక్టర్‌ శ్రేయ

సాక్షి, సిటీబ్యూరో: ఆధ్యాత్మికత ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నట్లు ప్రదీప్‌ జోషిపై సీసీఎస్‌ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసిన ఆయన మూడో భార్య డాక్టర్‌ శ్రేయ బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివిధ టీవీ చానళ్లలో ప్రవచనాలు వల్లించే ప్రదీప్‌ జోషి వాస్తవ జీవితంలో మాత్రం దుర్మార్గుడని ఆరోపించారు. ఆయన చెప్పే ధర్మం కేవలం పుస్తకాలకే పరిమితం, అది ఎదుటి వారికి చెప్పడానికే.. ఫాలో అవ్వడానికి కాదని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. తమ పెళ్లి సమయంలో అలేఖ్యతో వివాహం, విడాకులు, బాబు ఉన్న విషయం మాత్రమే చెప్పారు.

మరో యువతి లక్ష్మీ ప్రత్యూషతో వివాహమైన విషయం చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు.  అమాయక అమ్మాయిల్ని మోసం చేయడంతో పాటు వారిని వదిలించుకోవడానికి వారినే బ్లేమ్‌ చేస్తుంటాడని, గత ఏడాది మార్చిలో తమ వివాహమైందని, ఆ తర్వాత ఆరు నెలలకే తనను  వదిలించుకోవాలని చూశాడని శ్రేయ చెప్పారు.  ఒక దశలో తాను పుట్టింటికి వెళ్లినప్పుడు తిరిగి రానీయకుండా గేటుకు తాళం వేశాడని, పోలీసు కేసు పెట్టిన తర్వాత కౌన్సెలింగ్‌కు రాకుండా కరోనా పేరుతో తప్పించుకున్నాడని ఆమె ఆరోపించారు. 

మరిన్ని వార్తలు