భర్త నిర్వాకం: పెళ్లయిన 21 రోజులకే మరో వివాహం.. మొదటి భార్యకు విషయం తెలియడంతో

29 Apr, 2022 19:43 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: పెళ్లయిన ఇరవై రోజులకే ఓ ప్రబుద్ధుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి విషయం భార్యకు తెలియడంతో ఐదు నెలలుగా ఆమెను మభ్యపెడుతూ వచ్చాడు. కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను వేధిస్తుండడంతో తట్టుకోలేక గురువారం మొయినాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన  చిన్నమంగళారంలో చోటుచేసుకుంది. మొయినాబాద్‌ ఎస్‌ఐ శిరీష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిన్నమంగళారానికి చెందిన మురళీకి 2021 నవంబర్‌ 25న నగరంలోని  మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది.  

మురళి అదే సంవత్సరం డిసెంబర్‌ 13న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం భార్య లావణ్యకు తెలియడంతో నిన్న బాగా చూసుకుంటానంటూ ఐదు నెలలుగా మభ్యపెడుతూ వచ్చాడు. ఇటీవల భర్త మురళీతోపాటు అత్త, ఆడపడుచులు వేధింపులు మొదలు పెట్టారు. తట్టుకోలేక లావణ్య గురువారం మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.   
చదవండి: రూ.20 లక్షల కట్నం, ఘనంగా పెళ్లి.. ఏడాది కాకముందే..

మరిన్ని వార్తలు