పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి.. 

9 May, 2022 07:54 IST|Sakshi
రమాదేవి(ఫైల్‌)

అనంతపురం సిటీ: కదులుతున్న రైలు నుంచి పట్టు తప్పి కిందపడిన భర్త ప్రాణాలు కాపాడబోయి ఓ వివాహిత మృతి చెందింది. జీఆర్పీ ఎస్‌ఐ విజయకుమార్‌ తెలిపిన మేరకు... అనంతపురం మండలం రాచానుపల్లికి చెందిన గోపాల్, రమాదేవి (35) దంపతులు. వీరికి మూడేళ్ల కుమారుడు యశ్వంత్, రెండేళ్ల కుమార్తె మేఘన ఉన్నారు. శనివారం రాత్రి గుంతకల్లుకు వెళ్లేందుకు అనంతపురం రైల్వే స్టేషన్‌లో కాచిగూడ రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.
చదవండి: మంత్రి కొడుకుపై అత్యాచారం కేసు.. మత్తు మందు ఇచ్చి.. నగ్నంగా ఫొటోలు తీసి 

తొలుత భార్య, ఇద్దరు పిల్లలను గోపాల్‌ ఎక్కించారు. అప్పటికే రైలు ముందుకు కదిలింది. ఆ సమయంలో పట్టుతప్పి అతను కిందపడ్డాడు. భర్తను కాపాడబోయి రమాదేవి రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కుపోయింది. విషయాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్‌ లాగి రైలును ఆపారు. అప్పటికే దంపతలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శనివారం అర్ధరాత్రి రమాదేవి మృతి చెందింది. పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు