స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. ప్రియుడి పక్కా స్కెచ్‌!

20 Jun, 2021 18:16 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తనే హతమార్చిన ఘటన ఖమ్మం జిల్లా  కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు భాస్కర్ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ  కుటుంబాన్ని పోషించేవాడు. వివరాలు.. భాస్కర్, జనార్దన్ స్నేహితులు. గత రెండేళ్లుగా భాస్కర్ భార్యతో  జనార్దన్ అక్రమ సంబంధం నడుపుతున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి  జనార్దన్‌ను పలుమార్లు నిలదీశారు. కొన్ని రోజులు దూరంగా ఉండి  మరలా రాధమ్మతో అక్రమ సంబంధం  కొనసాగిస్తున్నాడు.

శనివారం రాత్రి ఇంట్లో భార్య రాధమ్మ, ప్రియుడు జనార్దన్ కలిసి ఉండగా చూసిన భాస్కర్.. గంట తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి రాధమ్మే హత్య చేయించిదని మృతుని బంధువులు ఆరోపించారు. భాస్కర్ మృతికి కారకుడైన ప్రియుడు జనార్దన్ ఇంటిముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో  ఆందోళన విరమించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చదవండి: చూస్తుండగానే మాయం.. సీసీటీవీలో చైన్‌ స్నాచింగ్‌ దృశ్యాలు 
ఏడాది కిత్రమే పెళ్లి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

మరిన్ని వార్తలు