పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య

10 May, 2022 02:26 IST|Sakshi
అఫ్రోజ్‌

పెద్దపల్లి రూరల్‌: భార్య వివాహేతర సంబంధాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్తను, ప్రియుడితో కలసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజేశం కథనం ప్రకా రం.. అఫ్రోజ్‌ జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌ ప్రాం తంలో బిర్యానీ సెంటర్‌ నడుపుతున్నారు.

ఈ క్రమంలో తనకు బంధువైన ఖాజాను పనిలో పెట్టుకున్నారు. అయితే ఖాజాతో అఫ్రోజ్‌ భార్యకు ఏర్పడిన సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. అఫ్రోజ్‌ వారిని పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పినా ఫలితం లేకపోయింది. కొద్ది రోజుల క్రితం వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అఫ్రోజ్‌ భా ర్యను పుట్టింటికి పంపి, ఖాజాను పని నుంచి తొలగించారు.

అప్పటి నుంచి వారిద్దరూ కలసి దిగిన ఫొటోలను అఫ్రోజ్‌కు పంపించి.. వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి పరువు తీస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. ఆ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురై అఫ్రోజ్‌ (43) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఖాజా, అఫ్రోజ్‌ భార్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు