ఇంటికి లేటుగా వస్తున్నాడని భర్త ముఖంపై..

7 Jan, 2021 10:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : భర్త ప్రతిరోజు ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడన్న కోపంతో అతడి ముఖంపై వేడివేడి నూనె పోసిందో భార్య. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సాగర్‌ జిల్లాకు చెందిన శివకుమారి అహివార్‌ అనే మహిళకు అరవింద్‌ అహివార్‌ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. రోజూ వారి కూలీ  పని చేసుకునే అరవింద్‌ ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో భార్యతో గొడవలయ్యేవి. పెద్దలు కల్పించుకుని ఇద్దరికీ సర్ధిచెప్పారు. అలా చాలా రోజులు గొడవలు పడకుండా ఉన్నారు. ( అనుమానిస్తున్నాడని భర్తను గొడ్డలితో నరికింది)

అయితే సోమవారం ఉదయం ఐదు గంటంల ప్రాంతంలో అరవింద్‌ నిద్రలో ఉండగా శివకుమారి అతడి ముఖంపై వేడివేడి నూనె పోసింది. అతడి అరుపులు విని అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడి ముఖంపై తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తేల్చారు. ఈ దారుణానికి కారణమైన నిందితురాలు ఎక్కడికీ పారిపోకుండా.. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేయటం గమనార్హం. ఆమెపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

మరిన్ని వార్తలు