వివాహేతర సంబంధం.. భర్త హత్యకు ప్రియుడితో కలిసి ప్లాన్‌.. వైన్స్‌లో మందు కొని..

21 Jul, 2023 15:26 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) తన భార్యతో కలిసి సంగారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఈశ్వరమ్మ ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.

అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం అంటూ కౌకూర్ దర్గా వద్దకు ఈశ్వరమ్మ తీసుకొచ్చింది. అనంతరం ఘట్కేసర్‌లో డాక్టర్ వద్దకు వెళ్దామని మాయ మాటలు చెప్పి యంనంపేట చౌరస్తాకు తీసుకొచ్చిన భార్య.. డాక్టర్ అందుబాటులో లేడని చెప్పింది. రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న భర్తకు పక్కనే ఉన్న వైన్ షాప్‌లో మద్యాన్ని ఈశ్వరమ్మ కొనుగోలు చేసింది.
చదవండి: మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్‌రూంలో గుప్తనిధులు..!

ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఫెర్టిలైజర్ షాప్‌లో ఈశ్వరమ్మ ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. రహస్యంగా మద్యంలో పురుగుల మందు కలిపిన భార్య.. భర్తకు తాగించింది.  భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి ఏమీ తెలియనట్టుగా పక్కనున్న వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించిన భార్య ఈశ్వరమ్మ తరలిచింది. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం అసలు విషయం బయటకొచ్చింది. భార్య ఈశ్వరమ్మను, ప్రియుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు