మహిళా హత్య: వివాహేతర సంబంధం?.. తమ్ముడి భార్యే..

12 Oct, 2021 18:59 IST|Sakshi
యాదమ్మ(ఫైల్‌)

మిస్టరీ గానే మహిళ హత్య

సాక్షి, శంషాబాద్‌ రూరల్‌: ఇందిరానగర్‌ దొడ్డిలో ఈ నెల 8న హత్యకు గురైన మహిళ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దివ్యాంగురాలైన యాదమ్మ అర్ధరాత్రి తన ఇంట్లోనే హత్యకు గురికాగా.. ఆమె వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు భావించారు. దీంతో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఆమె వద్ద ఉన్న బంగారం కోసం తమ్ముడి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో మరింతగా విచారణ కొనసాగుతుందని సీఐ ప్రకాష్‌రెడ్డి తెలిపారు.
చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!

గడ్డి కోసం వెళ్లిన మహిళపై తుపాకితో బెదిరించి సామూహిక లైంగిక దాడి

మరిన్ని వార్తలు