‘నీకు పెళ్లయింది కదా’.. ‘నా భార్య మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’

10 May, 2022 08:31 IST|Sakshi

పంజగుట్ట: ‘నారాయణపేట్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి తన భార్య త్వరలో చనిపోతుందని నన్ను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు తెలియకుండా ఫొటోలు తీసి వాటిని ఇంటర్‌నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడు’అని బాధిత కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకురాలు ఆవేదన చెందింది. శివకుమార్‌రెడ్డి అకృత్యాలపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చదవండి👉🏼 ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివకుమార్‌ రెడ్డికి అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు 2020లో పరిచయమైంది. పార్టీ కార్యకలాపాల కోసం ఆయన్ను కలిసేందుకు తరచూ సదరు మహిళ రాగా ఆమెపై కన్నేశాడు. కల్లబొల్లి మాటలు చెప్పి ప్రేమిస్తున్నానన్నాడు. ‘నీకు పెళ్లయింది కదా’ అని ఆమె ప్రశ్నించగా ‘నా భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. మూడేళ్లకన్నా ఎక్కువ కాలం బతకదు’అని నమ్మబలికాడు.

తనకో తోడు కావాలంటూ ఆమె మెడలో పసుపు తాడు కట్టి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయిందని చెప్పాడు. మాట్లాడుకుందామని పంజగుట్టలోని ఓ హోటల్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని నెట్‌లో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇప్పుడు దూరంగా ఉండటమే కాకుండా అనుచరులతో బెదిరింపులకు దిగుతున్నాడని ఆ మహిళ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
చదవండి👉🏾 వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని..

మరిన్ని వార్తలు