ఇన్‌స్టాలో పరిచయం.. ప్రేమ.. చెల్లి పెళ్లిలో ఇంట్లో వాళ్లకు పరిచయం.. చివరికి!   

31 Mar, 2022 17:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించి మోసం చేసిన యువకునిపై కేసు 

సాక్షి, ​కామారెడ్డి: ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకునిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సై శంకర్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివారాలిలా ఉన్నాయి.. రాజంపేట మండలం సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల  యువతిని లింగంపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన అనిల్‌ అనే యువకుడు ప్రేమించాడు. ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు బయట తిరిగారు.  ఈ నెల  23న అనిల్‌ చెల్లి పెళ్లి ఉండడంతో సదరు యువతిని రాంపల్లికి పిలిపించి చెల్లి స్నేహితురాలుగా తల్లిదండ్రులకు చెప్పాడు. రెండు రోజుల పాటు ఆమె అక్కడే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామని యువతి కోరగా అనిల్‌ నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ప్రేమికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
చదవండి: హోటల్‌ నిర్వాకం.. గుంత పొంగనాల్లో తాగిపడేసిన సిగరెట్‌ పీకలు 

మరిన్ని వార్తలు