యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం..

8 Nov, 2021 12:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి (హైదరాబాద్‌): నిరుపేద యువతులకు డబ్బును ఎరగా చూపుతూ.. గత కొంత కాలంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ మహిళను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ్మ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెపల్లి మహ్మదీయ కాలనీకి చెందిన షాబానాబేగం(37)ను గత కొంత కాలంగా పేదరికంలో ఉన్న అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దింపుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు