పశువులు మేపేందుకు వెళ్లిన మహిళపై అఘాయిత్యం.. ఆపై

26 Aug, 2021 10:43 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

సాక్షి, తుమకూరు(కర్ణాటక): పశువులు మేపేందుకు వెళ్లిన మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్యచేసి నగలతో ఉడాయించారు. ఈ ఘోరం  తుమకూరు నగర సమీపంలోని బెట్టద బుడద వద్ద చోటు చేసుకుంది. చోటాసాబ్‌ పాళ్యకు చెందిన శివకుమార్‌ భార్య జయలక్ష్మి(35) రోజూ తరహాలోనే మంగళవారం ఉదయం పశువులను మేపడానికి కొండప్రాంతానికి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భర్త గాలిస్తూ కొండ వద్దకు వెళ్లాడు.

అక్కడ జయలక్ష్మి విగతజీవిగా కనిపించింది. వంటిపై దుస్తులు చెదిరిపోవడం, మెడలోని మాంగల్యం చైన్, ఇతర బంగారు ఆభరణాలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్యాత్సంద్ర పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆనవాళ్లు  గుర్తించారు.  మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.    

చదవండి: భర్త, పిల్లలు దూరమయ్యారనే మనస్తాపంతో..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు