బార్‌లో బాయ్‌ఫ్రెండ్‌ నిర్వాకం.. కారుతో తొక్కి చంపేసిన ప్రియురాలు

8 Jun, 2022 13:11 IST|Sakshi

వాషింగ్టన్‌: యువతీయువకులు ప్రేమలో పడడం షరా మామూలే. అయితే ఇటీవల ట్రెండ్‌ చూస్తే అదే ప్రేమలో ఎవరో ఒకరు మోసపోవడం కూడా షరా మామూలుగానే మారిందనే చెప్పాలి. అయితే ఈ జాబితాలోని కొందరు మాత్రం ఆ బాధని మర్చిపోలేక నరకయాతన అనుభవిస్తుంటే మరికొందరు మాత్రం ప్రేమలో మోసం చేసిన వాళ్లు తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందేనంటూ ఏదో ఓ రూపంలో వారిపై కక్ష తీర్చుకుంటున్నారు. తాజాగా ఇదే తరహాలో ఓ యువతి ప్రియుడు చేసిన మోసానికి ఏకంగా అతడిని కారుతో తొక్కి చంపింది.  అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. 

అమెరికాలో ఉంటున్న ఆండ్రీ స్మిత్, గేలిన్‌ మోరిస్‌ ఇద్దరు ప్రేమికులు. అయితే ఇటీవల కొంత కాలంగా తన బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ ప్రవర్తనలో మార్పుని గమనించింది గేలన్‌. ఆండ్రీ తనను చీటింగ్‌ చేస్తున్నట్లు ఆమె అనుమానించింది. ఇంకేం క్లారిటీ కోసం ఆపిల్‌ ఫోన్‌లోని ఎయిర్‌ ట్యాగ్‌ ద్వారా అతడి కదలికలను ట్రాక్‌ చేసింది. అతను ఓ బార్‌లో ఉన్నట్లు తెలియడంతో అక్కడి వెళ్లింది. బార్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ మరో అమ్మాయితో ఉండడం చూసి కోపంతో ఊగిపోయింది. ఖాళీ వైన్‌ బాటిల్‌తో ఆమెపై దాడి చేయబోగా స్మిత్‌ జోక్యం చేసుకున్నాడు. దీంతో బార్‌ సిబ్బంది ఆ ముగ్గురిని బయటకు పంపారు.

కాగా, బార్‌ బయట స్మిత్‌పై మోరిస్ దాడి చేసింది. అంతటితో ఆగకుండా చేతులు కట్టేసి రోడ్డుపై పడేసింది. అనంతరం కారును అతడి మీదుగా నడిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన స్మిత్‌ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే అతను చనిపోయాడు. దీనికి కారకురాలైన ప్రియురాలు మోరిస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చదవండి: పబ్జీ దారుణం.. గేమ్‌ ఆడొద్దు బిడ్డా అంటే.. కోపంతో ఊగిపోయి, తండ్రి పిస్టల్‌ తీసుకుని

మరిన్ని వార్తలు