అక్రమ సంబంధం: భర్త నిద్రపోతున్న సమయంలో..

5 Jul, 2021 06:43 IST|Sakshi

మండ్య(కర్ణాటక): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన మండ్య నగరంలోని గుత్తలు లేఔట్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు...  గుత్తలు లేఔట్‌లో అల్తాఫ్‌ మెహది (54), భార్య సైదా రిజ్వాన్‌లు నివాసం ఉంటున్నారు. అల్తాఫ్‌ మండ్యలోని మంగళ గ్రామంలోని పీయూ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల సైదా రిజ్వాన్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా దావణగెరెకు చెందిన రహంతుల్లా పరిచయం అయ్యాడు. ఇద్దరు చాటింగ్‌ చేసుకునేవారు.

రహంతుల్లాకు సైదా ఒక టైల్స్‌ దుకాణం కూడా పెట్టించింది. వారి వివాహేతర సంబంధం తెలుసుకున్న అల్తాఫ్‌ భార్యను తీవ్రంగా మందలించాడు. దీంతో ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని ఇద్దరు పథకం వేశారు.  శుక్రవారం రాత్రి అందరూ పడుకున్న సమయంలో సైదా ప్రియున్ని పిలిపించుకుంది. నిద్రపోతున్న అల్తాఫ్‌ను ఇద్దరు గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతను వెళ్లిపోగా తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అంత్యక్రియలు కూడా చేశారు. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరినీఅదుపులోకి తీసుకున్నారు.     

మరిన్ని వార్తలు