అప్పు చెల్లించమంటే దాడి చేశారు 

5 Jul, 2021 17:57 IST|Sakshi
బాధితురాలు అరుణ

జయపురం: తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమన్నందుకు ఓ మహిళపై మరొక మహిళ దాడి చేసింది. నవరంగపూర్‌ దారుబంద వీధిలో ఉంటున్న ఆర్‌.అరుణ పొరుగున ఉంటున్న ఉషారాణి భర్త అనారోగ్యంతో ఉండగా, రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఉషారాణికి ఇచ్చిన అప్పును చెల్లించమని అడిగేందుకు ఆదివారం వారి ఇంటికి వెళ్లగా, ఉషారాణి కోపంతో దుర్భాషలాడుతూ.. తనపై దాడి చేసిందని అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలిపై చర్య తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వెల్లడించారు.

మరిన్ని వార్తలు