వివాహేతర సంబంధం.. ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు 

17 Sep, 2022 17:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొండపి(ప్రకాశం జిల్లా): ఓ మహిళ తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసింది. ఈ సంఘటన  కొండపి మండలం మూగచింతల గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. మూగచింతలకు చెందిన సీహెచ్‌ హరినారాయణకు అదే గ్రామానికి చెందిన  ఓ మహిళతో చాలా కాలం నుంచి వివాహేతర సంబంధం ఉంది. ఎప్పటిలాగే ఆమె ప్రియుడి కొస్టం వద్దకు బుధవారం రాత్రి  వెళ్లింది. కాసేపు సన్నిహితంగా ఉన్న ఆమె ముందస్తు పథకం ప్రకారం తన వద్ద ఉన్న బ్లేడుతో ప్రియుడి మర్మాంగాన్ని కోసింది.
చదవండి: వరుడు నచ్చకపోయినా వివాహం.. పెళ్లయిన పదిరోజులకే..

దీంతో హరినారాయణ లబోదిబోమంటూ కొస్టం బయటకు పరుగు తీశాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా హరినారాయణకు భార్య లేకపోవడంతో చాలా కాలం నుంచి ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఆస్తి కోసం లేదంటే మరేదైనా కారణంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై ఎస్సై రామకృష్ణని వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు