చిన్నారిపై మహిళ హత్యాయత్నం

17 Jul, 2021 17:25 IST|Sakshi
చిన్నారిని కాపాడిన యువకుడు

సాక్షి, ఉట్నూర్‌ (ఆదిలాబాద్‌): చిన్నారిపై మహిళ హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలో కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని వేణునగర్‌ కాలనీలో గుర్తు తెలియని మహిళ చిన్నారితో వచ్చింది. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేస్తూ సమీపంలోని గుట్ట వద్దకు తీసుకువెళ్లింది. అక్కడ విచక్షణ రహితంగా కొడుతుండడంతో అటుగా వెళ్తున్న ప్రభాస్‌ గమనించి అడ్డుకొని నిలదీశాడు. దీంతో సదరు మహిళ పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికుల సాయంతో పట్టుకొని పోలీసులకు అప్పగించాడు.

దాడిలో గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం చిన్నారిని పోలీసులకు అప్పజెప్పారు. ఈ విషయమై ఎస్సై  సుబ్బారావును వివరణ కోరగా.. ఆ చిన్నారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని విచారణ చేస్తున్నామని వివరించాడు. ప్రస్తుతం చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు