అమానుషం.. ఫ్రెండ్‌ తల్లిపైనే అఘాయిత్యం

26 Feb, 2021 19:35 IST|Sakshi

రాయ్‌పూర్‌ :  స్నేహితుడి తల్లిపైనే కన్నేసిన ఓ దుర్మార్గుడు ఆమెపై అఘాయత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన మహిళ (42)ను బండ రాయి మోదీ చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముండ్ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. బాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 20 ఏళ్ల  చింతామణి పటేల్ అలియాస్ చింటూ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఓ స్నేహితుడు ఉన్నాడు. బుధవారం అర్థరాత్రి దాటాక స్నేహితుడి ఇంటికి వెళ్లిన బాధితుడు.. తమ పొలంలో వరి కోసే యంత్రాన్ని చూసి వద్దామని, తోడు తీసుకెళ్లడానికి స్నేహితుడిని పిలివాల్సిందిగా కోరాడు. అయితే ఆ సమయంలో తన కొడుకు ఇంట్లో లేడని, తాను వెంట వస్తానని మహిళ పేర్కొంది.

దీన్ని అవకాశంగా మరల్చుకున్న నిందితుడు పొలం నుంచి తిరిగి వచ్చే సమయంలో స్నేహితుడి తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో అక్కడే ఉన్న బండరాయిని తలపై మోది అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మహిళ కేకలు విన్న కొంతమంది గ్రామస్థులు అక్కడికి చేరుకోవడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 

చదవండి :  (దారుణం: కోడలిపై మామ అత్యాచారం, కేసు నమోదు)
(పాపులర్‌ నటుడిపై లైంగిక వేధింపుల కేసు)


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు