నిత్య పెళ్లికూతురు.. ఒకరు కాదు ఏకంగా ఆరుగురితో

25 Sep, 2022 09:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చెన్నై): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుగురుని వివాహం చేసుకున్న నిత్య పెళ్లి కూతురు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నామక్కల్‌ జిల్లా పరమత్తి వేలూరు సమీపంలోని వేంకరైకల్లి పాలయానికి చెందిన ధనపాల్‌ (35)తో మదురైకు చెందిన సంధ్య (26)కు ఈ నెల 7వ తేదీ పుదువెంకరై ఆలయంలో వివాహం జరిగింది. వధువు తరఫున అక్క, మామ అని ఇద్దరు, బ్రోకర్‌ బాలమురుగన్‌ (45) మాత్రమే పాల్గొన్నారు. బ్రోకర్‌ బాలమురుగన్‌ కమిషన్‌ రూ. 1.50 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు.

ఈ నెల 9వ తేదీ సంధ్య అదృస్యమైంది. దీని గురించి వరుడు ధనపాల్‌ పరమత్తి వేలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో సంధ్య, ఆమె సహరులు, బ్రోకర్, బంధువులు ఓ ముఠా అని తెలిసింది. ఆమె ఆరు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. దీంతో మదురై జిల్లా వడిపట్టి చోళవందన్‌ పేటకు చెందిన సంధ్య (26), ధనలక్ష్మి (45), రామరాజన్‌ కుమారుడు గౌతమ్‌ (26), వడిపట్టికి చెందిన జయవేల్‌ (34)లను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.  

చదవండి: రిసెప్షనిస్ట్‌ హత్య కేసులో షాకింగ్‌ నిజాలు..

మరిన్ని వార్తలు