ప్రియుడి మృతి.. తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య

15 Aug, 2021 13:58 IST|Sakshi
శ్రీకాంత్ ( ఫైల్ ) కె.సౌమ్య ( ఫైల్ )

సాక్షి,నెల్లూరు: వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు . పెళ్లి చేసుకోవాలని పెద్దలను కూడా ఒప్పించారు. ఉపాధి నిమిత్తం వెళ్లిన ప్రియుడు మృతి చెందడంతో ఆ బాధను తాళ లేక ప్రియురాలు కూడా ఆత్మ హత్య చేసుకున్న సంఘటన ఉండ్రాళ్ల మండలంలోని యల్లాయపాళెం మజరా గ్రామనత్తంలో శనివారం చోటుచేసుకుం ది. స్థానికుల కథనం మేరకు .. గ్రామంలోని దళితవాడకు చెందిన ఉండ్రాళ్ల శ్రీకాం త్ ( 21 ) , అదే ప్రాంతానికి చెందిన కోరికల సౌమ్య ( 19 ) రెండేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువురి కుటుం బ సభ్యులు కూడా అంగీకరించారు. అయితే శ్రీకాంత్ ముగ్గురు కుమారుల్లో రెండో వాడు కావడంతో పెద్ద కుమారుడికి వివాహం చేశాక వీరికి పెళ్లి చేద్దామని పెద్దలు నిర్ణయించుకున్నారు.

ఇంతలో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ ఎలక్ట్రికల్ డెకరేటర్స్ వద్ద పనిచేస్తాడు. అందులో భాగంగా ఆత్మకూరు వద్ద డెకరేషన్స్ పని నిమిత్తం శుక్రవారం వెళ్లి విద్యుత్ షాకకు గురై మృతి చెందాడు. దీంతో మనస్తాపానికి గురైన సౌమ్య శనివారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న గుళికల మందు తీసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు నార్తురాజుపాళెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు . దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇద్దరి మృతదేహాలను గ్రామంలో ఒకేచోట ఖననం చేయడం అందరినీ కలచి వేసింది. వీరి మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు .

మరిన్ని వార్తలు