నా చావుకు ఎవరూ కారణం కాదు..

20 Nov, 2021 08:57 IST|Sakshi

సాక్షి, రొంపిచెర్ల(చిత్తూరు): ‘నేను వెళ్లొస్తా మీరు భద్రంగా ఉండండి’ అంటూ ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలకు చెప్పి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో జరిగింది. వివరాలు.. జగడంవారిపల్లెకు చెందిన అచ్చార్ల రెడ్డెప్ప, భార్య అశ్వని (32) దంపతులకు కుమార్తెలు సంధ్య(11), లిఖిత(9), కుమారుడు పవన్‌ (7) ఉన్నారు. గురువారం మధ్యాహ్నం ముగ్గురి పిల్లలతో ‘నేను వెళ్లి వస్తా.. మీరు భద్రంగా ఉండండి’అని చెప్పి పొలం వద్దకు వెళ్లి మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గురువారం సాయంత్రం భార్య ఇంటికి రాకపోవడంతో రెడ్డెప్ప చుట్టు పక్కల గాలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఆత్యహత్య చేసుకున్న అశ్వనిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అక్కడ సూసైడ్‌ నోట్‌ లభించింది. తన చావుకు ఎవరూ కారణం కాదని, కాళ్లు, నడుం నొప్పితో బాధపడుతున్నానని, వైద్యం చేయించుకున్నా ఫలితం లేదని రాసింది.

ఈ కారణంగానే ఆత్యహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. తన కుమారైను ఆడ పడుచు కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని కోరింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రొంపిచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ తులసీరామ్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు