విషాదం: రూ.25 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు.. అయినా చాల్లేదు..

15 Jan, 2022 20:05 IST|Sakshi

సాక్షి, మెదక్‌ (గజ్వేల్‌): జగదేవ్‌పూర్‌లో పండగ పూట ఆ ఇంట విషాదం నెలకొంది. భర్త వేధింపులకు భార్య బలైంది. నాలుగు రోజుల క్రితం పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన ప్రమాదంలో చికిత్స పొందుతూ పండగ పూట శుక్రవారం మృతి చెందింది.  తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..  జగదేవ్‌పూర్‌కు చెందిన పనగట్ల బాల్‌రాజు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు రమ ఉంది.  13 ఏళ్ల క్రితం రమను నిజామాబాద్‌కు చెందిన సంజయ్‌కు ఇచ్చి వివాహం చేశారు.

పెళ్లి సమయంలో రూ.25 లక్షల కట్నంతో పాటు బంగారు అభరణలు పెట్టారు. రెండేళ్ల పాటు సంసారం సాఫీగా సాగింది.  అప్పటి నుంచి ఆదనప్పు కట్నం కావాలని వేధింపులకు పాడ్పడడమే కాకుండా తాగుడుకు బనిసగా మారాడు. పలు సార్లు ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్తి చెప్పినా తనలో మార్పు రాకపోవడంతో భరించలేక రమ పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం తన అమ్మగారింటికి జగదేవ్‌పూర్‌కు వచ్చి ఇక్కడే ఉంటుంది.

చదవండి: (కిరాణా షాపుకు వెళ్లొస్తానని ఒకరు.. డ్యూటీకి వెళ్తున్నానని మరొకరు..)

కాగా మూడు నెలల  క్రితం సంజయ్‌ అత్తగారింటికి భార్య, అత్తమామలకు తాను మారినట్లు నమ్మించి భార్యను తీసుకెళ్లాడు. తీసుకవెళ్లిన నాటి నుంచి మళ్లీ వేధింపులు పెట్టాడు. నాలుగు రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. చుట్టు ప్రక్కన వారు చూసి  మంటలను ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం  ఇవ్వగా చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. పండుగ పూట కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా జగదేవ్‌పూర్‌లోనే అమె అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు