ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏం జరిగిందంటే?

7 Sep, 2021 06:45 IST|Sakshi

హోసూరు: ప్రియునితో సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకొంది. వివరాలు.. ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీపంలోని నరసీపురం గ్రామానికి చెందిన ప్రకాష్‌ భార్య లక్ష్మి (38) భార్యాభర్తలు కలిసి కర్ణాటకలోని బళ్లూరులో హోటల్‌ పెట్టుకున్నారు. తరచూ హోటల్‌కు వస్తున్న డెంకణీకోట తాలూకా ఎలసట్టి గ్రామానికి చెందిన సెల్వరాజ్‌ (28)తో లక్ష్మికి పరిచయమై ఇద్దరూ కలిసి హోసూరు సమీపంలోని బొమ్మండపల్లి ప్రాంతంలో కాపురంపెట్టారు. తరచుగా ప్రియుడు గొడవ పడడంతో విరక్తి చెందిన లక్ష్మి ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. మత్తిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

ఇవీ చదవండి:
వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు
నూటొక్క జిల్లాల.. కేటుగాడు! 

మరిన్ని వార్తలు