కటకటాల్లోకి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌

8 May, 2022 05:43 IST|Sakshi
సరస్వతి ( ఫైల్‌ ఫోటో )

ప్రేమపేరుతో వంచన.. యువతి ఆత్మహత్య

ఎస్‌ఐపై 420, 376, 306 సెక్షన్ల కింద కేసు నమోదు

పామిడి/అనంతపురం క్రైం: అనంతపురం జిల్లా పామిడి మండలం గురుమాంజనేయ కొట్టాలకు చెందిన సభావత్‌ తిరుపాల్‌నాయక్, సీతమ్మ దంపతుల కుమార్తె ఎస్‌.సరస్వతి (21) ఆత్మహత్యకు కారణమైన తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్‌ఐ రమావత్‌ విజయ్‌కుమార్‌ నాయక్‌ను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పామిడి పోలీస్‌స్టేషన్‌లో తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గురుమాంజనేయ కొట్టాల గ్రామానికే చెందిన రమావత్‌ విజయ్‌కుమార్‌ నాయక్‌ 2018లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం చంద్రగిరిలో పనిచేస్తున్నాడు. వరుసకు మామ కూతురైన సరస్వతిని రెండేళ్లుగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు.

అనంతపురానికి చెందిన భారతితోనూ ప్రేమాయణం నడిపాడు. ఆమె అనంతపురం దిశ పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కడంతో భారతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ విజయ్‌కుమార్‌ తనను వంచించడంతో సరస్వతి మనస్తాపానికి గురై బుధవారం  పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌పై 420, 376, 306 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పామిడిలో శనివారం అతన్ని అరెస్టు చేశారు. 

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు