విషాదం: నీ వెంటే మేమూ!

3 Nov, 2020 07:02 IST|Sakshi
భర్త రంజిత్‌కుమార్, పిల్లలు లక్షయ, అనుçసయ, భార్య రాశి (సూసైడ్‌ నోట్‌)  

భర్త మరణంతో బిడ్డలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న భార్య

కన్యాకుమారిలో విషాదం

సాక్షి, చెన్నై: భర్త మరణించి ఏడాది అవుతున్నా ఆయన జ్ఞాపకాలు వెంటాడటంతో బతుకు భారమై ఓ భార్య ఆత్మాహుతి చేసుకుంది. వెళ్తూ..వెళ్తూ ఇద్దరు ఆడ బిడ్డలను హతమార్చింది. కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌కు చెందిన రంజిత్‌కుమార్‌ (32), రాశి(30) దంపతులకు అక్షయ(5), అనుçసయ(3) ఉన్నారు. మెడికల్‌ ఏజెన్సీ నడుపుతూ వచ్చిన రంజిత్‌ కుమార్‌ గత ఏడాది అనారోగ్యంతో మరణించాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్త చంద్ర, మామ రామదాసు ఇంట్లో రాశి ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రంజిత్‌కుమార్‌ సంవత్సరికం జరిగింది. ఆ రోజు నుంచి తీవ్ర మనోవేదనతో ఉంది. (చదవండి: భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ)

ఈ క్రమంలో సోమవారం స్నానపు గది నుంచి వాసన రావడంతో అత్త చంద్ర వెళ్లి పరిశీలించింది. రాశి సజీవ దహనమై కనిపించింది. అనంతరం గదిలోకి వెళ్లి పిల్లలను చూడగా విగత జీవులుగా పడివున్నారు. నాగర్‌ కోయిల్‌ డీఎస్పీ వేణుగోపాల్, ఇన్‌స్పెక్టర్‌ సాయిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో రాశి రాసిపెట్టిన లేఖ బయట పడింది. తన అన్నలు, వదినమ్మలకు ఆ లేఖ రాస్తూ, తనను క్షమించాలని.. సంవత్సరికం కోసం ఎదురు చూశానని, ఆ తంతంగం ముగిసిందని, అందుకే తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొనడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచింది. (చదవండి: బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు