విషాదం: ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

18 Jun, 2023 21:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మౌలాలి ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ఆమె మృతిచెందింది. 

వివరాల ప్రకారం.. గౌతమ్‌ నగర్‌కు చెందిన సుజి(37) ఆదివారం మౌలాలి ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సదరు మహిళ ఆత్మహత్యాయత్నం గమనించిన స్థానికులు ఆమెను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నట్లు మల్కాజిగిరి సీఐ రవికుమార్‌ తెలిపారు. ఆమె మృతికి గల కారణాల గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి 

మరిన్ని వార్తలు