రాత్రిళ్లు కల్లోకి వచ్చి నాపై అత్యాచారం చేస్తున్నాడు

24 Jun, 2021 13:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పాట్నా : మాంత్రికుడు రాత్రిళ్లు కల్లోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వింత సంఘటన బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ఔరంగాబాద్‌ జిల్లా, కుద్వ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలోని గాంధీ మైదాన్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో గత జనవరి నెలలో ప్రశాంత్‌ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించింది. సదరు మాంత్రికుడు మహిళ కుమారుడి అరోగ్యం కోసం కొన్ని పూజలు నిర్వహించాడు. అయితే 15 రోజుల తర్వాత బాలుడు మరణించాడు. కుమారుడి మరణం తర్వాత ఆమె ప్రశాంత్‌ ఉంటున్న కాళీ బరి ఆలయానికి వెళ్లింది. తన కుమారుడు ఎందుకు మరణించాడో చెప్పాలని నిలదీసింది.

ఈ నేపథ్యంలో అతడు ఆమెపై అత్యాచారం చేయబోగా.. చనిపోయిన ఆమె కుమారుడు అడ్డుకున్నాడు. ఇక అప్పటినుంచి ప్రశాంత్‌ రాత్రిళ్లు ఆమె కల్లోకి వచ్చి అత్యాచారం చేసేవాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్‌ను విచారించగా ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. ఆమెను ఎప్పుడూ కలుసుకోలేదని విచారణలో తెలిపాడు. నిందితుడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు బాండ్‌పై సంతకం చేయించుకుని వదిలేశారు.

చదవండి : పెళ్లై మూడువారాలు.. బాయ్‌ఫ్రెండ్‌ మెసెజేస్‌.. కట్‌ చేస్తే..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు