దారుణం: భార్య ఆత్మను వెళ్లగొట్టాలని కూతురునే..

22 Feb, 2021 09:24 IST|Sakshi

చెన్నై: మూఢ నమ్మకాల పేరుతో ఓ తండ్రి కన్న కూతురునే పొట్టన బెట్టుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామనాథపురానికి చెందిన వీరసెల్వం విపరీతంగా మూఢ నమ్మకాలు, తాంత్రీక పూజలను నమ్ముతాడు. ఆయన కూతురు తరుణి(19) గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే తరుణి ఇటీవల తన తల్లి సమాధి ఉన్న ప్రాంతం వద్దకు వెళ్లి వచ్చింది. దీంతో తన భార్య ఆత్మ తరుణి శరీరంలోకి ప్రవేశించిందని అందువల్లనే ఆమె అనారోగ్యానికి గురైనట్లు వీరసెల్వం భావించాడు. ఏదీఏమైనా ఆమె శరీరం నుంచి తన భార్య ఆత్మను బయటకు పంపించాలని తాంత్రికపూజలు చేయడం మొదలుపెట్టాడు.

భార్య ఆత్మను కూతురు శరీరం నుంచి వెళ్లగొట్టాలని ఆమె మెడ, నడుముపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే తరుణి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమె మృతి చెందడాని తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

చదవండి: అందమైన అమ్మాయిలను చూపిస్తూ మసాజ్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు