అందరూ ఉన్నా... అనాథలా...

22 May, 2021 12:59 IST|Sakshi

అనారోగ్యంతో మహిళ మృతి

అంత దూరం నుంచి రాలేమన్న తల్లిదండ్రులు

సాక్షి, బంజారాహిల్స్‌: కరోనా మహమ్మారి వల్ల కడచూపుకూడా దక్కడం లేదు. తల్లిదండ్రులు చనిపోతే తమ పిల్లలు, కన్నవాళ్లు చనిపోతే తల్లిదండ్రులు చివరి చూపు చూసుకునేందుకు కూడా వీల్లేకుండా పోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఖానాపురానికి చెందిన శీలం అరుణ శ్రీ(31) బ్యూటీషియన్‌గా పనిచేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలోని యాదగిరి నగర్‌లో గత ఏడు సంవత్సరాలుగా ఉంటోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది.

కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసింది. తల్లిదండ్రులు స్వగ్రామంలో ఉండగా పోలీసులు వారికి సమాచారం అందించారు. అయితే కరోనా వ్యాపిస్తుండటంతో రాకపోకలకు కూడా తమకు తీవ్ర ఇబ్బందికారంగా ఉందని.. వచ్చివెళ్లేందుకు డబ్బులు కూడా లేవని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. మీరే అంత్యక్రియలు చేయాలని కోరారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో భద్రపరిచినట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖరరెడ్డి తెలిపారు.

చదవండి: జూబ్లీహిల్స్‌: ఓయో రూమ్‌లో వ్యభిచారం..

మరిన్ని వార్తలు