మల్కాజిగిరిలో కలకలం.. తల్లి మృతదేహంతో ఇంట్లో మూడురోజులుగా..

14 May, 2022 12:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్న ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: రోజూ నలుగురు మగాళ్లు మిస్‌!.. ఎన్నెన్నో కారణాలు

తల్లి మృతదేహంతో పాటు ముడు రోజులుగా కుమారుడు గడపడం కలకలం రేపింది. కుమారుడు సాయికృష్ణతో కలిసి తల్లి విజయ నివసిస్తుంది. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని  తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. కొడుకు మానసిక పరిస్థితి వల్ల కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు  కోణల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు