మొబైల్‌ దొంగతనం.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది

11 Jun, 2021 15:03 IST|Sakshi

ముంబై: ముంబై సమీపంలోని థానేలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో వెళ్తున్న మహిళ నుంచి ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్ దొంగతనం చేశారు. మొబైల్‌ను తిరిగి లాక్కునే క్రమంలో ఆ మహిళ కిందపడిపోగా.. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మహిపూర్‌కు చెందిన కన్మిలా రైసింగ్ అనే మహిళ థానేలోని ఓ 'స్పా'లో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. స్నేహితురాలితో కలిసి ఆమె ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో... బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాగేసుకున్నారు. ఫోన్‌ను తిరిగి లాక్కునే క్రమంలో ఆమె ముందుకు వంగడంతో ఆటో నుంచి రోడ్డుపై పడిపోయింది.

తలకు బలమైన గాయాలవడంతో ఆమెకు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఆటోలో ప్రయాణించిన తన స్నేహితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేఈ, సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా  ఇద్దరు నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల పేర్లు అల్కేష్ పర్వేజ్(20),మొమిన్ అన్సారీ(18)గా తెలిపారు. చోరీ చేసిన మొబైల్‌ను రికవరీ చేశారా లేదా అన్నది తెలియరాలేదు. గతంలోనూ వీరు మొబైల్ ఫోన్ల దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 

చదవండి: క్షుద్ర పూజలు: యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు