73 ఏళ్ల వృద్ధుడికి పెళ్లి ఆశ చూపించి.. రూ.కోటి టోకరా

8 Mar, 2021 10:56 IST|Sakshi

ముంబై : 73 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కోటి రూపాయలతో మహిళ ఉడాయించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మలద్ ప్రాంతానికి చెందిన జెరాన్ డిసౌజా అనే వృద్ధుడు 2010లో తండ్రి వారసత్వంగా వచ్చిన  ఆస్తిని విక్రయించగా వచ్చిన రూ. 2 కోట్లకు పైగా డబ్బులు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఓ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. ఇటీవలె వాటిపై వడ్డీ రూపంలో వచ్చిన భారీ మొత్తాన్నివిత్‌డ్రా చేసుకున్నాడు. అయితే అదే బ్యాంకులో పనిచేసే షాలిని అనే మహిళ ఈ మొత్తం వ్యవహారాన్ని క్షణ్ణంగా పరిశీలించింది. వృద్ధుడితో పరిచయం చేసుకుని స్నేహం చేయసాగింది. అతడ్ని పెళ్లి చేసుకుంటానని, వృద్ధాప్యంలో తోడుగా ఉంటానని నమ్మబలికింది.

దీంతో ఇద్దరూ కలిసి సినిమాలు, రెస్టారెంట్లకు షికార్లు వెళ్లారు. ఈ నేపథ్యంలో తాను ఓ వ్యాపారం ప్రారంభిస్తున్నానని, ఇందుకు ఇన్‌వెస్ట్‌మెంట్‌ పెడితే, ఇచ్చే లాభాలను ఇద్దరం పంచుకుందామని నమ్మబలికింది. దీంతో దాదాపు 1.3 కోట్ల రూపాయలను ఆమెకు  అప్పజెప్పాడు. డబ్బులు తన ఖాతాలో ట్రాన్స్‌ఫర్‌ అయిన వెంటనే మొభైల్‌ స్విచ్ఛాఫ్‌ చేసివేరే ఊరికి మకాం మార్చింది. అక్కడే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులకు తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు డిసౌజా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి : (నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి..)
(అత్యాచారం: ఇరవై ఆరేళ్ల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు)


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు