వంటగదిలో ఉన్న భార్య గొంతుకోసి హత్యచేసి.. మరో గదిలో..

8 Sep, 2022 12:42 IST|Sakshi
దినేష్, మంజుళ (ఫైల్‌)   

శివమొగ్గ (బెంగళూరు): భార్యను గొంతు కోసి చంపిన భర్త తాను చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన శివమొగ్గ నగరంలోని ప్రియాంక లేఔట్‌లో జరిగింది. తుంగా నగర పోలీసులు తెలిపిన ప్రకారం. మంజుళ (30), దినేష్‌ భార్యభర్తలు. మంగళవారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారు.

బుధవారం ఉదయం వంటగదిలోనున్న భార్యను దినేష్‌ చాకుతో గొంతు కోసి హత్య చేసి, మరో గదిలో తాను చేయి కోసుకున్నాడు. ఇరుగుపొరుగు చూసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

చదవండి: (‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్‌..?.. మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా..?')

మరిన్ని వార్తలు