అత్యాచారం కేసు: 33 ఏళ్ల తర్వాత మహిళకు శిక్ష

14 May, 2021 17:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌ శ్రావస్తిలో వెలుగు చూసిన ఘటన

ఐదుగురు నిందితుల్లో నలుగురు విచారణ సమయంలోనే మృతి

శ్రావస్తి/లక్నో: 33 ఏళ్ల క్రితం 12 ఏళ్ల మైనర్‌ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసేందుకు సాయం చేసిన మహిళకు శ్రావస్తి స్థానిక  కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. అదనపు సెషన్స్ జడ్జి పరమేశ్వర్ ప్రసాద్ గురువారం నిందితురాలికి 15 వేల రూపాయల జరిమానా విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది కేపీ సింగ్ తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులందరూ విచారణ సమయంలో మరణించారని ఆయన అన్నారు. కోర్టులో దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న పురాతన కేసుల్లో ఇది ఒకటి అని సింగ్ అన్నారు.

కేసు వివరాలు.. 33 ఏళ్ల క్రితం అనగా 1988, జూన్‌ 30న ఉత్తరప్రదేశ్‌ శ్రావస్తికి చెందిన బాధితురాలు సమీప గ్రామంలో ఓ విహానికి హాజరయ్యింది. రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా నిందితురాలు రామ్‌వతి, ఆమె తల్లి ఫూల్‌మాత మైనర్‌ను ముక్కు, పుస్సు, లాహ్రీ అనే ముగ్గురు వ్యక్తులకు అప్పగించారు. ఈ కేసులో ముక్కు, పుస్సు, లాహ్రీ, రామ్‌వతి, ఆమె తల్లి ఐదుగురిపై ఐపీసీ సంబంధిత విభాగాల కింద భింగా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. 33 సంవత్సరాల తరువాత, 2021 ఏప్రిల్‌లో కోర్టు వారందరినీ దోషులుగా గుర్తించి తన తీర్పును రిజర్వు చేసింది.

చదవండి: ఆసుపత్రిలో నర్సును లైంగికంగా వేధించిన డాక్టర్‌..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు