నాటుసారా కేసులో సంచలన తీర్పు

30 Apr, 2022 08:26 IST|Sakshi

మహిళకు రెండేళ్ల జైలు

రూ.2 లక్షలు జరిమానా

కాకినాడ లీగల్‌: నాటుసారా విక్రయిస్తున్న మహిళకు రెండేళ్ల జైలు, రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్‌ ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.మాధవి శుక్రవారం సంచలన తీర్పునిచ్చారు. ఇప్పటివరకు సారా కేసుల్లో నెలల వ్యవధిలోనే జైలు శిక్షలు, వేల రూపాయల్లోనే జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చేవారు. మొట్టమొదటిసారిగా భారీగా జరిమానాతోపాటు శిక్ష విధించారు.

ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం కాకినాడ గొడారిగుంట కొండేలుపేటకు చెందిన చోడిపల్లి బంగారమ్మ 2020లో జి–కన్వెన్షన్‌ హాలు ప్రాంతంలో సారా విక్రయిస్తున్న ఆమెను పోలీసులు పట్టుకుని 10 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బంగారమ్మపై నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు, రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

చదవండి👉బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసు: ఉన్మాదికి ఉరి

మరిన్ని వార్తలు