దర్శిలో కిడ్నాపైన పసికందు క్షేమం

30 Sep, 2020 17:44 IST|Sakshi

సాక్షి, ప్ర‌కాశం: నెల రోజుల వ‌య‌సున్న శిశువు కిడ్నాప్‌కు గురై, ఆ వెంట‌నే తల్లి ఒడిని చేరిన‌ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శిలో బుధ‌వారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం దొనకొండ మండలం పోలేపల్లికి చెందిన మరియమ్మకు నెల రోజుల వ‌య‌సున్న బిడ్డ ఉంది. ఆ పాప‌పై కన్నేసిన ఓ గుర్తు తెలియ‌ని మ‌హిళ త‌న‌ను అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌గా మ‌రియ‌మ్మ‌కు ప‌రిచ‌యం చేసుకుంది. ప్ర‌భుత్వం నుంచి మ‌హిళ‌ల‌కు డబ్బు వ‌స్తుంద‌ని నమ్మించి, ఫొటోలు దిగేందుకు ద‌ర్శి రావాల‌ని ఆమెను న‌మ్మించింది. (చ‌ద‌వండి: చిన్నారి అంజి కిడ్నాప్‌ కథ విషాదాంతం!)

ఓ న‌లుగురు మ‌హిళ‌ల‌ను ద‌ర్శికి తీసుకొచ్చింది. అనంత‌రం ఫొటో స్టూడియో ద‌గ్గ‌ర మ‌హిళ‌ల‌ను ఉంచి బిడ్డ‌ను తీసుకుని ప‌రారైంది. దీంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితురాలు మ‌రియ‌మ్మ పోలీసులను ఆశ్ర‌యించింది. కిలాడీ మ‌హిళ కోసం గాలింపు చేప‌ట్టిన పోలీసులు నూజెండ్ల మండ‌లం ఉప్ప‌ల‌పాడులో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ద‌గ్గ‌ర నుంచి బిడ్డ‌ను స్వాధీనం చేసుకుని త‌ల్లికి అప్ప‌గించారు. (చ‌ద‌వండి: తల్లి చూస్తుండగానే.. కూతురి కిడ్నాప్‌)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా