వదినపై మరిది కర్కశం 

10 Sep, 2020 09:18 IST|Sakshi

లారీతో తొక్కించిన వైనం 

రెండు కాళ్లు కోల్పోయి దీనావస్థ

మేడికొండూరు(గుంటూరు): చెల్లెలి కాపురాన్ని సరిదిద్దేందుకు వచ్చిన మహిళపై మరిది కర్కశం చూపిన ఘటన మేడికొండూరు మండల సమీపంలో డోకిపర్రు కాలువ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుంటూరు కొరిటెపాడుకు చెందిన వీరేంద్ర డోకిపర్రు సమీపంలోని క్వారీలో గ్రావెల్‌ మట్టి తోలుతుంటాడు. వీరేంద్ర కొంత కాలంగా తన భార్య మేరీతో గొడవ పడుతున్నాడు. వీరేంద్రకు సర్ది చెప్పేందుకు వదిన మీరాబి, మేరీ ఆటోలో వీరేంద్ర ఆచూకీ కోసం క్వారీ వద్దకు బయలు దేరారు. దారిలో వీరేంద్ర టిప్పర్‌లో గ్రావెల్‌ మట్టి లోడు చేసుకుని వెళుతున్నాడు. (చదవండి: బెజవాడలో హవాలా దందా..)

ఈ సందర్భంగా మీరాబి వీరేంద్ర లారీని ఆపే ప్రయత్నం చేసింది. వీరేంద్ర కర్కశంగా ఆమెను లారీతో తొక్కించి కొద్ది దూరంలో లారీ ఆపి పరారయ్యాడు. టైరు కింద పడి రెండు కాళ్లు కోల్పోయిన మీరాబి అచేతనంగా పడి ఉండటంతో స్థానికులు మేడికొండూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మేడికొండూరు ఎస్‌ఐ నూతక్కి నరహరి పరిశీలించి తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మేడికొండూరు సీఐ ఆనందరావు కేసు నమోదు చేసి పరారైన నిందితుడు వీరేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా