వివాహిత అదృశ్యం.. ఏడాదిన్నర బాబును ఇంటిలో వదిలి..

3 Apr, 2022 21:30 IST|Sakshi
నందిని(ఫైల్‌)

సంగారెడ్డి అర్బన్‌: వివాహిత అదృశ్యమైన సంఘటన పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం సీఐ రమేశ్‌ తెలిపిన వివరాలు ఇలా  ఉన్నాయి. కొండాపూర్‌ మండలం కిష్టయ్యగూడెంకు చెందిన ఆంజనేయులు, నందిని దంపతులు పట్టణ పరిధిలోని  భవానీనగర్‌లో నివాసముంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మార్చి 10 తేదీన ఆంజనేయులు పని నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లాడు.

చదవండి: బంజారాహిల్స్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసు: కీలక విషయాలు వెలుగులోకి..

తిరిగి ఇంటి వచ్చేసరికి ఏడాదిన్నర బాబును ఇంటిలో వదిలి నందిని వెళ్లిపోయింది. బందువులు, తెలిసిన వారిని విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 94906 17010, 0845527633 నంబర్లకు తెలియజేయాలన్నారు. 

మరిన్ని వార్తలు