తుపాకితో బెదిరించి వదినపై సాముహిక అత్యాచారం

2 Apr, 2021 18:18 IST|Sakshi

లక్నో: ఒంటరిగా ఉన్న మహిళను తుపాకితో బెదిరించి మరిది తన స్నేహితుడితో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని మీరట్ జిల్లాలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దీనిపై బాధిత మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌ జిల్లాలో నివసిస్తున్న బాధిత మహిళ భర్త తాగుబోతు. కొంతకాలం కిందట భర్త ఇళ్లు వదిలి వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన మరిది వరస అయ్యే సమీప బంధువు ఈ విషయం తెలుసుకున్నాడు. గురువారం రాత్రి బాధితురాలు ఒంటిరిగా ఉండటం గమనించి తనతో పోటు మరో యువకుడి వెంట తీసుకుని ఇంటి గోడ దూకి వెళ్లాడు.

అది చూసిన బాధిత మహిళ భయంతో కేకలు వేయగా.. వారితో పాటు తెచ్చుకున్న తుపాకితో ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఆమెపై ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి తెగబడి కామవాంఛ తీర్చుకున్నారు. అనంతరం ఈ విషయం ఎవరికైన చెబితే చంపెస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరసటి(శుక్రవారం) సదరు మహిళ మీరట్‌ పోలీసు స్టేషన్లో తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి మరిది వరసయ్యే బంధువుతో పాటు అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు